Header Banner

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

  Tue Feb 25, 2025 12:33        Europe, World

ఫ్రాన్స్ లో ఓ వైద్యుడు అత్యంత నీచమైన చర్యకు పాల్పడ్డాడు. అనారోగ్యంతో చికిత్స కోసం వచ్చిన రోగులపై అత్యాచారం చేశాడు. ఏళ్ల తరబడి సాగిన ఈ దారుణం ఇటీవల బయటపడింది. ఓ చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా, తాను చేసిన దారుణాలను ఆ వైద్యుడు వెల్లడించాడు. 1989 నుంచి 2004 వరకు 299 మందిపై అఘాయిత్యం చేసినట్లు అంగీకరించాడు. బాధితులలో ఎక్కువమంది చిన్నపిల్లలేనని, బాలికలతో పాటు బాలురపైనా దారుణాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడి బాధితులలో 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. అందులో కొంతమందికి తమపై అత్యాచారం జరిగిన విషయమే తెలియదని, పోలీసులు వెలుగులోకి తెచ్చిన నిందితుడి డైరీ ఆధారంగా వారు తెలుసుకున్నారని వివరించారు. బ్రిటానీ అనే ప్రాంతంలో 74 ఏళ్ల జోయెల్ లి స్కౌర్నెక్ ఓ ఆసుపత్రిలో సర్జన్ గా పనిచేసేవాడు. తన వద్దకు చికిత్స కోసం వచ్చే రోగులపై జోయెల్ అఘాయిత్యం చేసేవాడు. వారిని మత్తులోకి పంపాక అత్యాచారం చేసేవాడు.

 

ఇది కూడా చదవండి: భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

దాదాపు 30 ఏళ్లపాటు ఈ దారుణాలకు పాల్పడ్డాడు. అయితే, 2017లో పొరుగింట్లో ఉంటున్న ఓ ఆరేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. పాప తల్లిదండ్రులు కేసు పెట్టడంతో పోలీసులు జోయెల్ ను అరెస్టు చేశారు. విచారణలో నలుగురు చిన్నారులపై అత్యాచారం చేసినట్లు గుర్తించిన పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో 2020లో కోర్టు జోయెల్ కు 15 ఏళ్ల శిక్ష విధించింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. నిందితుడు జోయెల్ ఇంట్లో 3 లక్షలకు పైగా అసభ్య ఫొటోలు బయటపడ్డాయి. 650లకు పైగా అశ్లీల వీడియోలను గుర్తించినట్లు వివరించారు. లైంగిక దాడి జరిపిన బాధితుల వివరాలతో నిందితుడు ఓ డైరీని నిర్వహించినట్టు తెలిపారు. తాజాగా లభించిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు. చికిత్స కోసం తన దగ్గరికి వచ్చిన చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడినట్లు కోర్టులో జోయెల్ అంగీకరించాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోందని, దోషిగా నిర్ధారణ అయితే జోయెల్ కు మరో 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు వివరించారు.

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజం? ఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #FranceSurgeon #childabuse #CrimeNews